ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కేంద్రం శుభవార్త

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కేంద్రం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కేంద్రం నేడు ఒక శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రని నియమించేందుకు సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరికకు తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆంద్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక స్టీఫెన్ రవీంద్ర ని ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ స్టీఫెన్ రవీంద్ర కి ఆ పదవి అప్పగించేందుకు అంగీకరించని కేంద్ర ప్రభుత్వం తాజాగా సీఎం జగన్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాగా గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా స్టీఫెన్ రవీంద్ర విధులు నిర్వర్తించారు. దానికి తోడు రాయలసీమ ప్రాంతంలో కూడా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆయన పని తనానికి ముగ్దుడైన సీఎం జగన్మోహన్ రెడ్డి తన రాష్ట్రంలో స్టీఫెన్ రవీంద్ర కి బాధ్యతలను అప్పగించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి కేంద్రాన్ని ఒప్పించుకొని స్టీఫెన్ రవీంద్రని తన రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్ అధికారిగా నియమించుకున్నారు.