నిర్మాతగా రాణించేందుకు ప్రయోగాలు చేస్తున్న రామ్ చరణ్

నిర్మాతగా రాణించేందుకు ప్రయోగాలు చేస్తున్న రామ్ చరణ్

హీరోగా మాత్రమే కాకుండా రామ్ చరణ్ నిర్మాతగా కూడా రాణించేందుకు చాల ప్రయోగాలు చేస్తున్నారు. సై రా నరసింహారెడ్డి చిత్రం తో తండ్రికి అమూల్యమైన బహుమతి ని అందించిన చరణ్, ఇపుడు విక్టరీ వెంకటేష్ తో ఒక హిట్ మూవీ రీమేక్ ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ వద్ద లూసిఫర్ మరియు డ్రైవింగ్ లైసెన్సు అనే రెండు కథలు ఉన్నాయి. తన తండ్రి కోసం రామ్ చరణ్ లూసిఫర్ ని ఏరి కోరి ఎంచుకున్నారు. అయితే విక్టరీ వెంకటేష్ రెండో రీమేక్ చిత్రానికి సరిగ్గా సెట్ అవుతారని భావిస్తున్నట్లు సమాచారం.

వెంకటేష్ మెగా ఫామిలీ హీరోలకు అత్యంత సన్నిహితుడు కావడంతో రామ్ చరణ్ ఆఫర్ ని తిరస్కరించే అవకాశం లేదు. మెగా హీరోలతో సన్నిహితంగా ఉండే వెంకటేష్ గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాణ్ తో, ఎఫ్2 చిత్రంలో వరుణ్ తేజ్ తో కలిసి నటించారు. వెంకటేష్ ప్రస్తుతం అసురన్ రీమేక్ లో నటిస్తూ బిజీ గా వున్నారు. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తూ, చిరు152 నిర్మాత బాధ్యతలని చూసుకుంటున్నాడు. మరి రామ్ చరణ్ తీయబోయే చిత్రంలో విక్టరీ వెంకటేష్ నటిస్తారో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.