ముఖ్య అతిధిగా త్రివిక్రమ్

ముఖ్య అతిధిగా త్రివిక్రమ్

నితిన్ – రష్మిక హీరో హీరోయిన్లుగా, వెంకీ కుడుమల దర్శకత్వంలో వస్తున్నటువంటి తాజా చిత్రం “భీష్మ”… మహతి ఆర్ ఆర్ సంగీత సారథ్యంలో రానున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు… ఇకపోతే ప్రస్తుతానికి ఈ చిత్ర ప్రమోషన్లతో బిజీగా ఉన్న చిత్ర బృందం సోమవారం నాడు ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించింది. కాగా యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ లో ఘనంగా నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరు కావడం తో ఈ వేడుక కి ఇంకాస్త కల వచ్చింది.

ఐతే ఈ వేడుకకి ముఖ్య అతిధిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ భీష్మ చిత్రాన్ని చూశానని, కానీ ఈ చిత్రంలో ముఖ్యంగా రెండు బాగా నచ్చాయని, ఒకటి ఫైట్స్ మరియు సాంగ్స్ బాగా నచ్చాయని చెప్పారు. అంతేకాకుండా సాంగ్ కంపొజిషన్ మరియు మహతి ఆర్ ఆర్ ఇచ్చిన సంగీతం బాగా నచ్చాయని ప్రశంసించారు. అంతేకాకుండా నితిన్ మరియు రష్మిక మధ్యలో వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయని, నితిన్ నటనతో మరొక ఎత్తుకు ఎదిగాడని చెప్పి అందరిపై ప్రశంసల వర్షం కురిపించారు.