దేశంలో బంగారం, వెండి ధరలు సామాన్యులని బెంబేలెత్తిస్తున్నాయి. పెళ్లి సీజన్లో మరింత పెరుగుతుంది. ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలు చూసి మధ్యతరగతి తల్లి తండ్రులు సొమ్మసిల్లుతున్నారు. తమ కుమార్తె పెళ్లికు బంగారం కొనాలంటే గుండె ఝల్లుమంటోందంటూ వాపోతున్నారు. అయితే గత రెండ్రోజులుగా దాదాపు పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,379 ఉండగా, శుక్రవారం నాటికి రూ.72 పెరిగి రూ.74,451కి చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.83,638 ఉండగా, శుక్రవారం నాటికి రూ.11 పెరిగి రూ.83,649కు చేరుకుంది.
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.74,451, కిలో వెండి ధర రూ.83,649గా ఉంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,451, కిలో వెండి ధర రూ.83,649.. విశాఖపట్నంలో బంగారం రూ.74,451, వెండి రూ.83,649గా ఉంది. ఈ ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి . ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని వ్యాపార విశ్లేషకులు చెబుతున్నారు.