ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో చేస్తున్న భారీ మూవీ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికి తెలిసిందే. మరి ఈ మూవీ లో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఇప్పటికే చాలా మేర షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ లో అనేక సర్ప్రైజ్ లు కూడా ఉన్నాయి. మరి లేటెస్ట్ గా ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు బాగా వినిపిస్తోంది.
![గుడ్ న్యూస్ : విజయ్ “గోట్” లో ఇంకొక హీరో? Good news: Vijay is another hero in "Goat"?](https://i0.wp.com/telugu.telugubullet.com/wp-content/uploads/2024/05/Untitled-design-50-2.jpg?resize=300%2C197&ssl=1)
ఈ మూవీ ఒక ప్రముఖ యంగ్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టుగా తెలుస్తుంది . మరి ఆ హీరో ఎవరు తెలుగు నుంచి ఉంటాడా లేక తమిళ్ నుంచి ఉంటాడా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు అలాగే ఏ జి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 5న మూవీ గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్నది .