Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘రచ్చ’ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాల పాటు పవన్‌తో సినిమా చేసేందుకు సంపత్ నంది ఎదురు చూశాడు. అయితే కొన్ని కారణాల వల్ల పవన్‌తో సంపత్ నంది సినిమా చేసే అవకాశం రాలేదు. పవన్ కాదన్న వెంటనే రవితేజతో ‘బెంగాల్ టైగర్’ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించడం జరిగింది. ఆ సినిమా అట్టప్ ఫ్లాప్ అయ్యింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని గోపీచంద్ హీరోగా ‘గౌతంనంద’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాకు ముందు గోపీచంద్‌కు కూడా పెద్దగా సక్సెస్‌లు లేవు. అయినా కూడా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించడం జరిగింది.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రారంభం అయిన ఈ సినిమాపై విడుదల సమయంకు భారీగా అంచనాలు ఏర్పడటం చిత్ర యూనిట్ సభ్యులకు సైతం ఆశ్చర్యంను కలిగిస్తుంది. సినిమాలో గోపీచంద్ లుక్‌తో పాటు, సంపత్ నంది స్టైలిష్ టేకింగ్‌తో సినిమా భారీగా తెరకెక్కింది. ఆ విషయం ట్రైలర్లో అర్థం అవుతుంది. ‘గౌతమ్‌నంద’ చిత్రాన్ని నైజాం ఏరియాకు గాను దిల్‌రాజు రైట్స్ తీసుకున్నాడు. దాంతో అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తానికి అందుకునేందుకు పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఈ ఫ్లాప్ కాంబో చిత్రం పంపిణీ హక్కులు హాట్ కేక్ మాదిరిగా అమ్ముడు పోతున్నాయి. జులైలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.