పెను సంచలనం…ఈవీఎంలు టాంపరింగ్ చేసి గెలిచినా మోడీ…!

Gopinath Munde Was Murdered As He Know Secret Of EVM Tampering

భారత్ లో ఒకప్పుడు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరిగేవి, ఎంత మంది వోటర్లు ఉన్నారో తెలుసుకుని అన్నే వోట్ల బేలట్లను ముద్రించడం వలన పెద్దగా అక్రమాలకు తావు ఉండేది కాదు. కానీ కాలంతో పాటు మార్పు తేవాలన్న తలంపుతో ఈవీఎంలు తయారీ చేశారు. వీటి వలన సమయం కలిసి రావడమే కాదు పెద్దగా మ్యాన్ పవర్ కూడా అక్కర్లేదు అందుకే ప్రభుత్వాలు దీని మీద మొగ్గు చూపారు. అయితే ఇవి టాంపరింగ్ చేయచ్చని గతంలో ఎంత మంది వాదించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు దానికి కారణం అవి ఆరోపనలే ఎవరూ వాటిని ప్రూవ్ చేయలేకపోయారు. కానీ ఇంకా లోక్ సభ ఎన్నికలకి మూడు నెలల సమయం ఉండగా బీజేపీకి పెను షాక్ ఇస్తూ ఆ పార్టీ బండారాన్ని బయట పెట్టాడు. ఒక సైబర్ నిపుణుడు. 2014 నుంచి గత ఏడాది వరకూ భారత్ లో జరిగిన అన్ని ఎన్నికలు ట్యాంపర్ అయ్యాయని ఆ ట్యాంపరింగ్ చేసింది తన టీమేనని సయ్యద్ సుజా అనే వ్యక్తి లండన్ వేదికగా బయటపెట్టి కలకలం రేపారు. భారత జర్నలిస్ట్ అసోసియేషన్ యూరప్ చాప్టర్ నిర్వహించిన ఈ హ్యాకధాన్ లో లండన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన ఫేస్ కనబడకుండా మీడియా ముందుకు వచ్చిన సయ్యద్ ఈవీఎంలు రూపొందించిన ఈసీఐఎల్ నిపుణుల బృందంలో కీలక వ్యక్తిగా చెప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో ఈ సయ్యద్ మరో నలుగురితో కలిసి ఈవీఎంల ట్యాంపరింగ్ కకు పాల్పడ్డానని పేర్కొన్నారు. మిగతా నలుగుర్ని భారతీయ జనతా పార్టీ నేతలు చంపించారని తనను కూడా చంపుతారన్న భయంతోనే విదేశాలకు పారిపోయి ఇప్పుడు అమెరికా శరణార్ధిగా ఆశ్రయాన్ని కోరానని అక్కడే బతుకుతున్నని చెప్పుకొచ్చాడు. సయ్యద్ సుజా ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చో ప్రత్యేకంగా డెమో కూడా ఇచ్చారు. బ్లూంబెర్గ్ క్వింట్ న్యూస్ ఎజెన్సీ ఈ తతంగం మొత్తాన్ని లైవ్ టెలికాస్ట్ చేసింది.

ట్యాంపరింగ్ గురించి పూర్తి వివరాలు తెలిసిన వారిని ఒక్కొక్కరూ హత్యకు గురవుతున్నారని సయ్యద్ చెప్పుకొచ్చారు. బిజెపి నేత గోపీనాధ్ ముండేతో పాటు అప్పట్లో ఎన్నికల ప్రధానాధికారి సంపత్ ఆధ్వర్యంలోనే ట్యాంపరింగ్ ప్రాసెస్ జరిగినట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయం మొత్తం తెలుసు కాబట్టి బయటకు వస్తుందన్న భయంతోనే గోపీనాథ్ ముండేని బీజేపీ నేతలే హత్య చేశారని చెప్పారు. ఎన్నికలు జరిగి బీజేపీ అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే ముండే ఢిల్లీలో అనుమానాస్పదంగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే జర్నలిస్ట్ గౌరీ లంకేష్ కు ఈ వ్యవహారం మొత్తం తెలుసని దీన్ని ఆమె బయట పెట్టాలనుకున్నారని కానీ ఈ లోపే ఆమె కూడా హత్యకు గురయ్యారని ఆయన చెబుతున్నారు. తనను కూడా చంపాలని బిజెపి పెద్దలు ప్రయత్నించారని వారి నుండి తప్పించుకుని దేశం నుండి పారిపోయానని సయ్యద్ ఆరోపించారు. గత లోక్ సభ ఎన్నికలకు సంబంధించి యూపీ, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ట్యాంపరింగ్ చేశామని స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ట్యాంపరింగ్ కు అవకాశం కుదరలేదన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్ కు తాను సహకరించలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బిజెపికి లాభం కలిగేలా రిలయన్స్, జియో అన్ని ఏర్పాట్లు చేశాయని సయ్యద్ చెబుతున్నారు. దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో రియలన్స్ కంపెనీ సహకారంతో జియో నెట్ వర్క్ సహాయంతో ట్రాన్స్ మిట్ చేసి ట్యాంపరింగ్ చేశారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 201 సీట్లను ట్యాంపరింగ్ వల్ల కోల్పోయిందంటున్నారు. సయ్యద్ సుజా ఆధారాలు మొత్తం తాను మీడియాకు ఇస్తానని చెబుతున్నారు. ఈవీఎంల పనితీరుపై దేశంలో చాలా కాలంగా అనుమానాలున్నాయి. తాజాగా కలకత్తాలో సమావేశమైన విపక్ష పార్టీలు కూడా ఈవీఎంల మీదే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ఇప్పుడీ ట్యాంపరింగ్ విషయం బయటకు రావడం దేశంలో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఈసీ ఖండించింది. అయినా ఈ విషయం అంత తేలిగ్గా మర్చిపోయే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే బీజేపీయేతర పక్షాలన్నీ బ్యాలెట్ వోటింగ్ నే కోరుతుండగా ఈ వ్యవహరం ఎంత దూరం వెళుతుందో చూడాలి.