అందరూ అనుకున్నట్టే జరిగింది.ముందు నుండి ఊహాగానాలు వచ్చినట్టే తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసేశారు. తెలంగాణా ఏర్పాటయ్యాక ఏర్పడిన తొలి ప్రభుత్వాన్ని నాలుగేళ్ల మూడు నెలల కాలమే పాలించి 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి దేశం మొత్తం మీద చర్చనీయాసం అయింది. ప్రగతిభవన్‌లో ఈరోజు మధ్యాహ్నం కేసీఆర్ ఆధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దుకు ఏకవాక్య తీర్మానం చేశారు. ఆ వెంటనే కేసీఆర్ ఆ తీర్మాన ప్రతిని తీసుకొని రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ నరసింహన్‌కు అసెంబ్లీని రద్దు చేస్తు్న్నట్లు తెలిపి ఆ తీర్మానాన్ని అందజేశారు. తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్ దానికి ఆమోదం తెలిపారు.
తెలంగాణ కేబినెట్ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రద్దు కానుండగా ఆ తర్వాత నుంచి మరో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రి కేసీఆరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ రద్దును ధృవీకరిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించాక ఆయన తెలంగాణా భవన్ చేరుకుని ప్రెస్ మీట్ ప్రారంభించారు. ఇదే సమయంలో కొంతమంది అభ్యర్ధులని అయన ప్త్రకటిస్తారని భావిస్తుండగా ఏకంగా 105 మంది అభ్యర్ధులను ప్రకటించారు.