Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిచ్చి… కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తే చేజేతులా పోగొట్టుకోవడమేంటని గవర్నర్ నరసింహన్ ఐవైఆర్ కృష్ణారావుకు క్లాస్ పీకారట. పైగా ప్రభుత్వంపై తొందరపడి విమర్శలు చేయకుండా ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తం చేశారట. సివిల్ సర్వీస్ అధికారులుగా పనిచేసినవారికి ఎలా ఉండాలో ఎవరూ చెప్పక్కర్లేదని, రాజకీయ ఉద్దేశాలు లేనప్పుడు అధికార పార్టీకి అనుమానం కలిగేలా ఎలా ఉన్నారని గవర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
పైగా పదవి నుంచి తీసేశారని తెలియగానే… ఫక్తు రాజకీయ నాయకుడిలాగా తనను తాను సమర్థించుకుంటూ… ఎదుటివారిపై తప్పు నెట్టేసే ప్రయత్నం చేయడంపై ఎక్కువ విమర్శలు వచ్చిన విషయాన్ని కూడా ఐవైఆర్ కు గుర్తు చేశారట గవర్నర్. హైదరాబాద్ లో ఏపీ సర్కారును తిడుతూ ప్రెస్ మీట్ పెట్టిన ఐవైఆర్ వెంటనే రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. అప్పుడే ఐవైఆర్ కు హితవు చెప్పారట గవర్నర్.
ఐవైఆర్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయనకు మరో పదవి ఉంది. అదే అర్చక సంక్షేమ నిధి ఛైర్మన్. ఇప్పుడు ఐవైఆర్ ను కేవలం బ్రాహ్మణ కొర్పేరేషన్ ఛైర్మన్ పదవి నుంచి మాత్రమే తొలగిస్తూ జీవో వచ్చింది. అంటే అర్చక సంక్షేమ నిధికి ఛైర్మన్ గా కొనసాగుతున్నట్లే. అలాంటప్పుడు తొందరపడి మాట్లాడి… ఉన్న విలువ పోగొట్టుకోవద్దని చెప్పడంతో ఐవైఆర్ సైలంట్ అయ్యారట.