మూడేళ్ల తర్వాత రెండో సినిమాకు గ్రీన్‌సిగ్నల్

Green signal for second movie after three years

ప్రేమమ్ సినిమాతో (మలయాళం) సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది అనుపమాపరమేశ్వరన్. ఆ తర్వాత తమిళంలో ధనుష్‌తో కలిసి ‘కోడి’ చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలపైనే దృష్టిపెట్టింది. అనుపమ దాదాపు మూడేళ్ల తర్వాత మరో తమిళ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తమిళ హీరో అథర్వ మురళి నటిస్తోన్న చిత్రంలో హీరోయిన్‌గా సైన్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మూవీలో అథర్వ మురళి పీహెచ్‌డీ స్కాలర్‌గా కనిపించనుండగా..అనుపమ భరతనాట్యం నృత్యకారిణిగా మెరువనుందట.
కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ జులై 15 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ అమెరికా, ఆస్ట్రేలియాలో పూర్తి చేయనుంది చిత్రయూనిట్. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో రాక్షసుడు సినిమా చేస్తోంది. త్వరలో విడుదల కానుంది.