Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావులు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. వారిద్దరి కాంబోకు మంచి పేరుండేది. ఇద్దరు కలిసి నటిస్తున్నారు అంటే అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ అయినట్లే అనే భావన ఉండేది. వారిద్దరి కాంబోలో వచ్చిన చిత్రమే ‘గుండమ్మ కథ’. తెలుగు సినిమా బతికి ఉన్నన్ని రోజులు ఆ సినిమా గురించి చర్చించుకుంటూనే ఉంటారు. అదో అద్వితీయ చిత్రంగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయింది. ఆ సినిమాను జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య రీమేక్‌లు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతుంది.
కొందరు దర్శకుగు ‘గుండమ్మ కథ’కు సీక్వెల్ అంటూ కొన్ని కథలు కూడా రాశారు. అయితే సీక్వెల్ కంటే అదే కథతో కాస్త మోడ్రన్ హంగులు అద్ది చేయడం వల్ల తప్పకుండా ప్రేక్షకులు ఆకట్టుకుంటారు అనే నమ్మకంతో ప్రముఖ నిర్మాత రామానాయుడు ఉండే వారు. అయితే ఆయన మరణం తర్వాత ఆ సినిమా అటకెక్కింది. తాజాగా ఆ ప్రాజెక్ట్ గురించి నాగచైతన్య మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ చేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని, ఎన్టీఆర్‌తో ‘గుండమ్మ కథ’ చిత్రాన్ని చేసేందుకు తాను ఎప్పుడు కూడా సిద్దంగా ఉంటాను అంటూ చైతూ ప్రకటించాడు. దాంతో దీనిపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. ప్రయోగాత్మకంగా ఈ సినిమాను చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అయితే అంత సులభంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లదని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.
మరిన్ని వార్తాలు