జీవీఎల్ నరసింహారావు, గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఈయన ఎన్నికల సర్వేలు నిర్వహించడంలో, వ్యూహరచనలో ప్రావీణ్యం ఉందని చెప్పుకుంటూ ఉంటారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ స్ట్రాటజికల్ టీంలో పని చేసానని చెప్పుకునే ఆయన మొత్తానికి ఎలాగోలా రాజ్యసభ ఎంపీ అయిపోయారు. అదేమీ విచిత్రమో ఆయన ఎంపీ అయ్యేదాకా కనీసం ఆయన సొంత వూరి వారికి కూడా పెద్దగా పరిచయం లేని ఆయన ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే టార్గెట్ అని విమర్శలు చేస్తూ కూర్చున్నారు. కానీ అదేమీ విచిత్రమో ఆయన చేసే పోయిన ఆరోపణలు అయనలోని మరో కోణాన్ని ఆయనకుసంబంధం లేకుండానే ఆవిష్కరిస్తూ ఉంటాయి.
అందుకే ఒకటి నిన్న ఢిల్లీలో జరిగింది. అంతే దాన్ని పట్టుకుని టీడీపీ సోషల్ మీడియా ఆయన్ని ఉతికి ఆరేసింది. ఈసారి శ్రీ మాన్ జీవీఎల్ ఎలా దొరికిపోయారంటే జీవీఎల్ ఎక్కడ దొరికిపోయాడంటే ఈ స్టోరీ చదవాల్సిందే. తాజాగా ఆయన చేసిన ట్వీట్లు ఆయన పరువు తీసాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి .. ఐక్యరాజ్యసమితి పురస్కారం లభించింది. యూఎన్ బహూకరించే చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును మోదీ గెలుచుకున్నారు. మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ సంయుక్తంగా ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. ఫ్రాన్స్, భారత్ మధ్య సౌరశక్తిపై అవగాహన కుదిరిన నేపథ్యంలో ఇద్దరు దేశాధినేతలకు ఈ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును అంతజేయడానికి యూఎన్ ఎన్విరాన్ మెంట్ హెడ్ ఎరిక్ స్లోహెమ్ ఢిల్లీ వచ్చారు. ఓ కార్యక్రమంలో అవార్డు ప్రధానం చేశారు.
ఇదంతా బాగానే ఉన్నా ఈ యూఎన్ ఎన్విరాన్ మెంట్ హెడ్ ఎరిక్ స్లోహెమ్ ను కొద్ది రోజుల కిందట జీవీఎల్ నరసింహారావు ఓ ఫేక్ వ్యక్తిగా అభివర్ణించాడు. చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగానికి ఆహ్వానం రాలేదని వాదించే క్రమంలో ఈ ఎరిక్ స్లోహెమ్ ప్రస్తావన తెచ్చి అతనో ఫేక్ వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఇప్పుడు అదే ఎరిక్ స్లోహెమ్ ఢిల్లీ వచ్చి మోడీకి అవార్డు అందజేశారు. దాన్ని అత్యంత గౌరవంగా మోడీ అందుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు బయటకు రాగానే టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఆ ఫేక్ వ్యక్తి దగ్గర మోడీ ఎందుకు అవార్డు తీసుకోవాల్సివచ్చిందని విమర్శలు గుప్పించారు. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో బహుసా !