Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక్క నెలలో రెండు భారీ కుంభకోణాలు బయట పెడతామంటూ ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేసిన హెచ్చరికలతో మోడీ సర్కార్ వణికిపోతోంది. ఢిల్లీ కంపిస్తోంది. వచ్చేది ఎన్నికల ఏడాది కావడంతో వెంటనే బీజేపీ హైకమాండ్ నుంచి ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టమని రాష్ట్ర బీజేపీ నేతలకు వర్తమానం అందింది. అందుకే ఉదయం పదిగంటలకల్లా యూపీ నుంచి ఎంపీగా ఎన్నికైన జీవీల్ నరసింహారావు ప్రెస్ మీట్ పెట్టి తమ ప్రభుత్వం ఏ తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. కుటుంబరావు స్టాక్ మార్కెట్ నిపుణుడు, అతనికి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో ఏ అనుభవం ఉందని వ్యక్తిగత విమర్శలకు దిగడంతో పాటు సాక్షి లో రాసిన ఎయిర్ ఏషియా ప్రతినిధుల సంభాషణ గురించి ప్రస్తావించారు. ఏపీ సర్కార్ అభద్రతతో ఈ నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
జీవీఎల్ ప్రెస్ మీట్ ఏ విధంగా మాట్లాడినప్పటికీ ఆయన బాడీ లాంగ్వేజ్ ,మాటల్లో తడబాటు చూస్తే కుటుంబరావు ఆరోపణలతో బీజేపీ ఎంత కంగారు పడుతుందో అర్ధం అవుతోంది. పైగా ఇంకో విషయంలో కూడా జీవీఎల్ అడ్డంగా బుక్ అయిపోయారు. నిన్నటిదాకా యూసీలు పంపలేదంటూ అదేదో ఘోరమైన నేరంలా చెప్పుకొచ్చిన జీవీఎల్ , కుటుంబరావు కౌంటర్ తర్వాత నిస్సిగ్గుగా మాట మార్చారు. కేవలం పేపర్స్ పంపితే సరిపోతుందా అని సరికొత్త వాదన ముందుకు తెచ్చారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చకుండా ఇక్కడ రాజకీయ , కుల ,మత పరిస్థితుల్ని అనువుగా మార్చుకుని సీఎం చంద్రబాబుని దెబ్బ కొట్టడానికి బీజేపీ వేస్తున్న ఎత్తులు ఎప్పటికి అప్పుడు చిత్తు అవుతున్నాయి. అయినా బీజేపీ అదే దారిలో వెళుతూ ఏదో చేయాలి అనుకుంటున్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో గమనించారు. ఏదేమైనా 2019 ఎన్నికలు జరిగే దాకా వీళ్ళ వాగాడంబరం భరించాల్సిందే.