హన్సిక ఫోన్ హ్యాక్ !

Hansika Phone Hacked

సినిమాలతో బిజీగా ఉండే తారలు అప్పుడప్పుడు విదేశాలు వెళ్లి హాలిడేలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హన్సిక కూడా ఇటీవల విహారయాత్రకు న్యూయార్క్‌‌ వెళ్లింది. అయితే అక్కడ హన్సిక తీసుకున్న వ్యక్తిగత ఫొటోలు తాజాగా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. తెలుపు రంగు బికినీలో ఉన్న హన్సిక ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఈ ఫొటోలను హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో పెట్టలేదు. కానీ, చాలా మంది యూజర్లు ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలను ఆయా సోషల్ మీడియా సంస్థలు తొలగించాయి. . గతంలో అమీ జాక్సన్, అక్షర హాసన్ మొబైల్‌లో ఉన్న ఫొటోలను హాకర్లు ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. తన ఫొటోలను లీక్ చేసిన హ్యాకర్లపై ముంబై పోలీసులకు అక్షర ఫిర్యాదు చేశారు. తాజాగా దీనిపై హన్సిక స్పందించింది. తన ఫోన్, ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని తెలిపింది. వాటి ద్వారా వచ్చే సందేశాలకు స్పందించవద్దని అభిమానులను కోరింది. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు తన టీమ్ కృషి చేస్తోందని తెలిపింది.