అలాంటి పాత్రలు చేయనంటున్న హీరోయిన్‌

Hansika-Ready-To-Act-In-Thr

‘దేశముదురు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ముద్దుగుమ్మ హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. పెళ్లి వార్తలపై ఈ అమ్మడు తాజాగా స్పందించింది. తన పెళ్లి గురించి ఇంకా ఏమి ఫిక్స్‌ కాలేదని, ప్రేమ పెళ్లి మాత్రం అస్సలు కాదని, నా బాద్యత మొత్తం అమ్మ చూసుకుంటోంది కాబట్టి పెళ్లి కూడా అమ్మ చూపించిన వ్యక్తినే చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చింది. గతంలో ఈ అమ్మడు తమిళ హీరో శింబుతో ప్రేమలో ఉందని, వీరిద్దరి పెళ్లి కూడా జరగబోతుందని వార్తలు వచ్చాయి. అయితే శింబుతో బ్రేకప్‌ అయ్యాక ఈ అమ్మడికి ప్రేమపై ఉన్న నమ్మకం పోయినట్టు కనిపిస్తుంది. అందుకే జీవితంలో కీలక విషయమైన పెళ్లి బాద్యత అమ్మకే వదిలేసింది. అమ్మ ఇష్టానుసారంగానే పెళ్లి ఉండబోతుందని హన్సిక చెప్పుకొచ్చింది.

hansika-movies

కెరియర్‌ గురించి మాట్లాడిన హన్సిక తనకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదని, 18 కథలను విన్న తాను కేవలం 4 కథలకు మాత్రమే ఒకే చెప్పానని అంటోంది. ఇకపై గ్లామర్‌ పాత్రల్లో కాకుండా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నాను. కేవలం నటనకు పాద్రాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటాను. గ్లామర్‌ పాత్రల్లో ఇప్పటికే చాలా చేశాను. ఇకపై అలాంటి పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని ముద్దుగుమ్మ హన్సిక చెబుతోంది. అయితే ఈ అమ్మడు అనుకుంటున్నట్టు అన్ని లేడి ఓరియెంటెడ్‌ ఆఫర్లు వస్తాయా? అనేది సందేహమే. వచ్చిన అవకాశాలను వదులుకోకుంటే ఇంకా కొన్నాళ్లు తెరపై కనిపించే అవకాశం ఉందని ఈమె సన్నిహితులు చెబుతున్నారు.

Hansika