తెలుగు తెర దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ స్ఫూర్తిని, లెగసీని కొనసాగిస్తూ మన మూవీ ను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో ప్రభాస్. ఇవాళ ఈ పాన్ ఇండియా స్టార్, ఇండియన్ సినిమా ఛత్రపతి ప్రభాస్ పుట్టినరోజు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో పరిచయం అయిన ప్రభాస్…నటనలో ఆత్మవిశ్వాసం, పరిణితి ప్రదర్శించాడు. ఈశ్వర్ లో ప్రభాస్ పర్ఫార్మెన్స్ చూసిన వారు అతనో ఫ్యూచర్ స్టార్ అని చెప్పేశారు. అన్ని ఎమోషన్స్ పలికించే ప్రభాస్ నటనతో పాటు డ్యాన్స్ లు, ఫైట్స్, అందానికి తగిన హైట్ ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. మొదటి మూవీ తోనే ప్రభాస్ హీరోయిజానికి అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానం లభించింది.
వర్షం ప్రభాస్ కు తొలిసారి బిగ్ కమర్షియల్ సూపర్ హిట్ ఇవ్వగా..రాజమౌళి కాంబినేషన్ లో చేసిన ఛత్రపతి మాస్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ ని అందించింది. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు ప్రభాస్. ‘రాఘవేంద్ర’ ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’, ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్’ ‘రెబల్’…వంటి సినిమాలన్నీ నటుడిగా ప్రభాస్ వెర్సటాలిటీ చూపిస్తాయి. మిర్చి..ఆయన కెరీర్ లో ఓ స్పెషల్ సూపర్ హిట్. బాహుబలి రెండు మూవీ ల రికార్డ్ స్థాయి విజయాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్.
తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ మార్కెట్ ను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రభాస్ కి మాత్రమే దక్కుతుంది. ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని రికార్డులెన్నో ప్రభాస్ తిరగరాశాడు . తెలుగు మూవీ కు 2000 కోట్ల కలెక్షన్స్ సాధించే సత్తా ఉందని బాహుబలి -2తో ప్రభాస్ నిరూపించాడు. ఓవర్‌సీస్ మార్కెట్‌లో పది మిలియన్లకుపైగా వసూళ్లను సాధించిన తొలి హీరో ప్రభాస్. బాహుబలి రెండు మూవీ ల తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఇక ఓన్లీ తెలుగు సినిమా చేసే స్థాయి దాటిపోయింది. మరి తన రాబోయో మూవీ లతో తెలుగు మూవీ గర్వించే విజయాలు సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే యూనివర్సల్ డార్లింగ్ ప్రభాస్.