చిరంజీవికి తమ్ముడు స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ఆయనొక లేక నువ్వు విడుదల చేశారు. కోట్ల మంది అభిమానాన్ని మూట కట్టుకున్న కిచెన్ మీలో కనిపించక పోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం అంటూ మెగాస్టార్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్.
‘‘అన్నయ్య చిరంజీవిగారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. .ఒక సన్నని వాగు అలా ఆలా ప్రవహిస్తున్న మహా నదిగా మారినట్టు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం
కోట్లాదిమంది అభిమాన్నాన్ని మూటగట్టుకున్న కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని మెగాస్టార్‌కి పవర్‌స్టార్ శుభాకాంక్షలు తెలియజేశారు.