మహిళా టెక్కీపై కామ పిశాచి పైత్యం.. మూడు నెలల పాటు నరకం..

హైదరాబాద్‌లో ఘోరం వెలుగు చూసింది. తాజాగా అమానుష ఘటన నగరంలో చోటుచేసుకుంది. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై లైంగిక దాడికి పాల్పడిన యువకుడు ఆ దారుణాన్ని వీడియో తీసి బెదిరిస్తూ చిత్రహింసలకు గురిచేశాడు. ఆ కామాంధుడి చేతిలో నెలల పాటు నరకాన్ని అనుభవించిన బాధితురాలు చివరికి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఆ దుర్మార్గుడి బాగోతం బయట పెట్టింది. కాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన యువతి బీటెక్‌ చదివి కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూకి వెళ్లింది. అక్కడ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ సయమంలో అతడు.. ఆమె ఫోన్ నంబర్ తీసుకొని తరుచూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత పార్టీలకు పిలుస్తూ సామీప్యం చేసుకున్నాడు.

అలా సాగుతున్న సమయంలో ఓ రోజు పార్టీ పేరుతో హోటల్‌కు పిలిచి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చేశాడు. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెపై లైంగిక దాడికి పాల్పడి సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని ఆ కీచకుడు అమ్మాయిని వేధింపులకు గురిచేయడం స్టార్ట్ చేశాడు. రోజూ ఆమెకు వీడియో కాల్స్ చేస్తూ నగ్నంగా కనిపించాలంటూ వేధించసాగాడు. ఛాతీపై కత్తితో గాట్లు పెట్టుకోవాలని.. రక్తం కారుతుండగా తాను చూడాలని విచిత్రమైన చఫల చేష్టలకు దిగేవాడు. అలా.. గుండెలపై తన పేరుతో రాసుకోవాలని.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు తన గదికి వచ్చి శారీరకంగా కోరికలు తీర్చాలని చెప్పేవాడు.

అంతేకాకుండా తాను చెప్పిన మాట వినకపోతే న్యూడ్ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తానని కూడా హెచ్చరించేవాడు. దీంతో ఆమెకు వచ్చే జీతాన్నంతా తనకే ఇవ్వాలని.. లేకపోతే చంపేస్తానని కూడా బెదిరింపులకు దిగాడు. ఇలా మూడు నెలల పాటు ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయికి నరకం చూపించాడు. అయితే ఇలా జరుగుతుందని తను ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయేది. ఇక రోజురోజుకీ అతడి పైశాచికం ఎక్కువైపోతుండటంతో తట్టుకోలేకపోయింది. దీంతో అతడు పెట్టే చిత్రహింసలు భరించే కంటే చావే శరణ్యమనుకుని ఓసారి ఆత్మహత్యకు కు కూడా ప్రయత్నించింది. అయితే కుటుంబసభ్యులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయినప్పటికీ ఆమెను వదలని ఆ సైకో మళ్లీ వేధింపులు స్టార్ట్ చేశాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించి మొత్తం వారికి బొమ్మేసి చూపించింది. దీంతో ఈ ఘటనతో చలించిపోయిన పోలీస్‌ కమిషనర్ సజ్జనార్ వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో షీ టీమ్ డీసీపీ అనసూయ తన సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడిపై రెండ్రోజుల్లో పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని డీసీపీ స్పష్టం చేశారు.