నిన్న తెల్లవారు ఝామున రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరగనున్నాయి. తెలంగాణా ప్రభుత్వ లంచానాలతో ఈ కార్యక్రమం జుబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో జరగనుంది. దీంతో ఆయన అంతిమ యాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు నగర పోలీసులు. మాసబ్‌ట్యాంక్ నుంచి సరోజినిదేవి కంటి ఆస్పత్రి మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు నగర పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ మీదుగా వాహనదారులంతా వెళ్లాలని సూచించారు. గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు ఫిల్మ్‌నగర్ మీదుగా మళ్లించినట్టు తెలిపారు.
వాహనదారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించి కోరారు. అయితే నగరంలోని వీఐపీలు అంతా హరికృష్ణ ఇంటికి క్యూ కట్టిన నేపధ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫ్‌క్ జామ్ ఏర్పడింది. లకిడికపూల్ ఫ్లైఓవర్, మహవీర్ ఆస్పత్రి, మసబ్ ట్యాంక్ టవర్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి వైఎంసీఏ ఫ్లైఓవర్, ఎస్‌బీహెచ్ క్రాస్‌రోడ్, ప్లాజా క్రాస్‌రోడ్ ప్రాంతల్లో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి.
అయితే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆయన అంతిమయాత్ర మొదలు కానుంది. అయితే ముందు నుండి అనుకుంటున్నట్టు ఆయన్ను చైతన్య రధం మీద ఊరేగించడంలేదు. ఎందుకంటే ప్రస్తుతం అది ఎన్టీఅర్ బయోపిక్ షూటింగ్ నిమిత్తం ఆర్ట్ డిపార్ట్మెంట్ వద్ద ఉంది. ఇప్పటికిపుడు దానిని రెడీ చేసే అవకాసం లేకోపోవడంతో ప్రస్తుతానికి ఒక మినీ లారీని వారు సిద్దం చేస్తున్నారు.