Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Harish Rao Class To Kodandaram
టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిజాయితీగా ఉంటారని, అన్నీ నిజాలే చెబుతారని తెలంగాణ ప్రజల్లో ఇమేజ్ ఉంది. ఆయనకు ఓట్లేస్తారా.. వేయరా అనే విషయం పక్కన పెడితే.. ఓ మేధావిగా ఆయన చెప్పే మాటలు శ్రద్ధగా వింటారనేది కాదనేలని వాస్తవం. ఈ విషయం హరీష్ కూ తెలుసు. అందుకే కోదండం అమరుల యాత్ర టార్గెట్ గా హరీష్ రెచ్చిపోయారు. తన స్టైల్లో పంచ్ లు వేశారు.
కోదండరాంకు సడెన్ గా ఎందుకు అమరులు గుర్తొచ్చారని, అసలు అమరుల పేరుతో రాజకీయ యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగని హరీష్ తన రాజకీయ ప్రత్యర్థులపై చేసే తీవ్రస్థాయి విమర్శల్నే ప్రొఫెసర్ మీద చేయడం అందర్నీ ఆశ్చర్యపోయింది. కోదండరాం కంటికి నిజం కనబడటం లేదని, ఇలాగే అవాకులు చెవాకులు పేలితే.. ప్రజల్లో ఉన్న విశ్వసనీయత పోతుందని హెచ్చరించారు.
హరీష్ రావు అంత గట్టిగా కోదండానికి చెక్ చెప్పే ప్రయత్నం చేయడానికి కారణం ఉంది. తన జిల్లా నుంచే అమరుల యాత్ర మొదలెట్టిన కోదండరాం.. హరీష్ అనుచరుడు చింతా ప్రభాకర్ నియోజకవర్గం సంగారెడ్డిలో యాత్రకు నాంది పలికారు. దీంతో కోదండం దూకుడుకు ముందుగానే కళ్లాలు వేయకపోతే.. తర్వాత అసలుకు ఎసరు వస్తుందని హరీష్ భావించారు. అందుకే ఈ ఎదురుదాడి.