పవన్‌, త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ ఖాయం

hat trick for pawan kalyan and trivikram
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పవన్‌ కెరీర్‌లో నిలిచి పోయే విజయాలను దక్కించుకున్న ఆ రెండు చిత్రాలు ఇప్పటికి కూడా ప్రేక్షకుల హృదయాలను బుల్లి తెరపై వచ్చినప్పుడల్లా దోచుకుంటూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్‌ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.

‘అత్తారింటికి దారేది’ చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన ఈ కాంబో ఈసారి నాన్‌ బాహుబలి రికారులను బద్దలు కొట్టడం ఖాయం అంటూన్నారు. తెలుగు సినిమా స్థాయి ఇటీవల బాగా పెరిగింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో తెలుగు సినిమా కలెక్షన్స్‌కు రెక్కలు వచ్చాయి. అందుకే అక్కడ మార్కెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఓవర్సీస్‌లో కనీసం 7 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయాలనే పట్టుదలతో చిత్ర యూనిట్‌ సభ్యులు డిస్ట్రిబ్యూటర్‌తో ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్‌ సినిమా కూడా విడుదల కాని రేంజ్‌లో అజ్ఞాతవాసి ఓవర్సీస్‌లో విడుదల కాబోతుంది. ప్రఖ్యాత యూనివర్శిల్‌ స్టూడియోలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దాంతో ఈ చిత్రం కలెక్షన్స్‌ ఆకాశాన్ని అంటేలా ఉంటాయని సినీ విశ్లేషకులు మరియు ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.