క‌త్తి మహేష్ పై పవన్ కౌంటర్… కత్తి రీ-కౌంటర్

Pawan kalyan Tweet on Kathi Mahesh Comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై క‌త్తిమహేష్ మాట‌ల దాడి కొన‌సాగుతోంది. చాలా రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పైనా, ఆయ‌న అభిమానుల పైనా క‌త్తి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ కామెంట్లు చేస్తున్నా… స్పందించ‌ని ప‌వ‌ర్ స్టార్… ఈ ఉద‌యం మాత్రం ప‌రోక్షంగా ఒక ట్వీట్ చేశారు. వ్య‌క్తిత్వంలో నిన్ను ఓడించ‌డం చేత‌కాని వాళ్లే… నీ కులం, ధ‌నం, వ‌ర్ణం గురించి మాట్లాడతారు… అంటూ ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. దీన్ని ఎవ‌రు చెప్పారో తెలియ‌దు కానీ… గౌర‌వ‌నీయ ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ త‌న‌ను ఈ విధంగా గ్రీట్ చేశారని, బాగుంద‌ని షేర్ చేస్తున్నాన‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. క‌త్తి మ‌హేష్ ను ఉద్దేశించి ప‌వ‌న్ ప‌రోక్షంగా ఈ ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు. దీనిని రీట్వీట్ చేసిన ప‌లువురు నెటిజ‌న్లు సైతం ఇది క‌త్తిమ‌హేష్ కు ప‌వ‌న్ ఇచ్చిన కౌంట‌ర్ అని కామెంట్ చేశారు. ప‌వ‌న్ ఈ ట్వీట్ చేసిన కాసేప‌టికే కత్తి మ‌హేష్ స్పందించారు.

ఎప్ప‌టిలానే ఘాటు గా బ‌దులిచ్చారు. ధ‌నం, వ‌ర్ణం, కులం గురించి మాట్లాడుతున్న‌ది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్, గ‌ర్ల్ ఫ్రెండ్… నేను కాదని, కాబ‌ట్టి పెట్టే గ‌డ్డేదో వాళ్ల‌కే పెట్టాల‌ని సూచించారు. ఇక వ్య‌క్తిత్వం విష‌యానికొస్తే… దాని గురించి నువ్వు మాట్లాడ‌క‌పోతేనే బెట‌ర్ అంటూ ఎద్దేవాచేశారు. అన‌వ‌స‌రంగా క‌డుపు చించుకుంటే కాళ్ల‌మీద ప‌డుతుంది, జాగ్ర‌త్త అంటూ ఘాటువ్యాఖ్య‌లు చేశారు. ఈ కామెంట్ కు మీలో మీరు మాట్లాడుకుంటున్నారా…? అంటూ ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించ‌గా… ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ట్వీట్ కు స‌మాధానం ఇచ్చానంటూ స్ప‌ష్టంచేశారు క‌త్తి మ‌హేష్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ విధానాల‌ను, ఆయ‌న అభిమానుల ఆగ‌డాల‌ను క‌త్తి మ‌హేష్ ఫేస్ బుక్ లో ఎండ‌గ‌డుతున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ పేరిట కొంద‌రు చేస్తున్న దుర్భాష‌ల‌ను బ‌హిర్గ‌తం చేస్తున్నారు. ప‌వ‌న్ తాజా సినిమా అజ్ఞాత‌వాసిపైనా… విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అజ్ఞాత‌వాసి ప్రీమియ‌ర్లువిచ్చ‌లవిడిగా వేసుకోవ‌చ్చ‌ని, టికెట్ రేట్లు పెంచుకోవ‌చ్చ‌ని, ఎక్స్ ట్రా షోలకు కూడా అనుమ‌తి ఉంద‌ని, ప్ర‌జ‌ల డ‌బ్బులు ఘ‌రానాగా దోచుకునే ప్లాన్ రెడీ అని మ‌హేష్ విమ‌ర్శించారు. ప‌వ‌న్ స‌లాం ఒక‌రికి, గులాంగిరి మ‌రొక‌రికి చేసి సాధించుకున్న హ‌క్కులు ఇవ‌ని కామెంట్ చేశారు. కానీ పాపం త్రివిక్ర‌మ్ సినిమా కాపీ కొట్టి ఇబ్బందులు పాలు చేశాడ‌ని, టి. సిరీస్ వేసిన‌కేసుతో ట్రైల‌ర్ రిలీజ్ చెయ్య‌లేక‌, సినిమాకు కోర్టులో ఎలాంటి ఇబ్బందులు వ‌స్తాయో తెలీక నిర్మాత సత‌మ‌త‌మవుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. ఇది చాలా బాధాక‌ర‌మైన వార్త‌ని, కానీ అప్పుడ‌ప్పుడూ బాధ కూడా మంచిదే అని తాజాగా త‌న ఫేస్ బుక్ లో కామెంట్ చేశారు క‌త్తిమ‌హేష్.

Pawan Kalyan tweets

Kathi Mahesh Comeents On Pawan kalyan Mahesh Kathi Comments On Pawan kalyan