టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి సరైన అభ్యర్థని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపే సామర్థ్యమున్నకుంబ్లేనే ఈ పదవి అర్హుడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
ఇక ప్రస్తుత సెలక్షన్ బృందంపై అన్ని వైపులా విమర్శలు వస్తున్న తరుణంలో సెహ్వాగ్ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతమున్న సెలక్టర్లలో ఒక్కరు కూడా సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన వారు కాదని, 15కి మించి మ్యాచ్‌లు ఆడలేదని మాజీ క్రికెటర్లు చాలా మంది విమర్శించారు.
దీంతో సెలక్టర్ల కాంట్రాక్టు ముగుస్తున్న తరుణంలో బీసీసీఐ వారిని కొనసాగిస్తుందా లేదా వేరే ఎవరైనా దిగ్గజాలకు అవకాశం కల్పిస్తుందా అనేది వేచి చూడాలి.