హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో హెడ్‌కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రకాశ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ రివాల్వర్‌తో ప్రకాశ్‌రెడ్డి కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుటాహుటిన నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రకాశ్ రెడ్డి మృతిచెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఆత్మాహత్యాయత్నానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఎస్‌ఐ తన రివాల్వర్ ను స్టేషన్ లోనే ఉంచి ఇంటికి వెళ్లినట్లుగా సమాచారం. పీఎస్ లో ఎవరూ లేని సమయంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రకాశ్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శబ్దం విని లోపలికి వచ్చే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు.