ఏపీకి భారీ వర్ష సూచన !

heavy-rain-forecast-to-ap

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ‌న ద్రోణి ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీటితో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, క‌ర్నూలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. స‌ముద్రం అల్లక‌ల్లోలంగా ఉంటుందని, అల‌ల ఉద్ధృతి ఎక్కువ‌గా ఉంటుందని తెలిపారు. గంట‌కు 45 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మ‌త్స్యకారులు స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేటి నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.