భూగ్రహానికి 20 శాతం ప్రాణవాయువు అందించే అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు రేగి.. చెట్లు, వన్యప్రాణులు దగ్ధం అయిపోతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్లు నాటాలని కోరారు.
కాగా అమెజాన్ అడవుల కోసం ప్రముఖ హాలీవుడ్ హీరో, పర్యావరణ వేత్త లియోనార్డో డికాప్రియో విరాళం అందించేందుకు ముందుకొచ్చారు. ఆయన జులైలో ‘ఎర్త్ అలయన్స్’ అనే పర్యావరణ ఫౌండేషన్‌ను స్థాపించారు. దీని ద్వారా 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.36 కోట్లు) విరాళం ఇవ్వనున్నట్లు లియోనార్డో ప్రకటించారు.
అమెజాన్ అడవుల సంరక్షణ, అక్కడి ప్రజలు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు తమ వంతు సహాయం చేయాలంటూ ఆయన ఫాలోవర్స్‌ను కోరారు.
విరాళంగా ఇచ్చిన ప్రతి రుపాయి అమెజాన్ సంరక్షణ కోసం ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం alliance.org/amazonfund వెబ్సైట్ చూడమని తెలిపారు.