ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్.. వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. అన్ని రకాల మోటార్‌సైకిల్, స్కూటర్ల ధరలను ఒక్కశాతం వరకు పెంచినట్లు సోమవారం ప్రకటించింది. పెంచిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ధరలు పెంచడానికి గల కారణాలను సంస్థ వెల్లడించలేదు. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయా షోరూంలలో ఉన్న ధరలు బట్టి ఒక్క శాతం వరకు అన్ని రకాల మోడళ్లు ప్రియంకానున్నాయి.