సుమంత్ హీరోగా నటించిన ‘మళ్లీ రావా’ చిత్రంతో దర్శకుడు గౌతమ్ తిన్నసూరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ చిత్రంతో సుదీర్ఘ కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సుమంత్‌కు సక్సెస్ దక్కింది. కమర్షియల్‌గా కూడా గౌతమ్ మంచి మార్కులే దక్కించుకున్నాడు. పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలకు క్లాస్టచ్ ఇస్తూ ఈయన సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈయన నాని హీరోగా ‘జెర్సీ’ అనే చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. టీం ఇండియా జర్సీని ఫస్ట్‌లుక్‌గా అప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రం 1980 మరియు 1990ల కాలంలో చూపించబోతున్నారు. అప్పటి కథకు కాస్త మాస్, ఎంటర్టైన్మెంట్ను జోడించి‘జెర్సీ’ని నాని కోసం సిద్దం చేస్తున్నాడు.
ఇటీవలే రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రంతో 1980ల్లోకి తీసుకు వెళ్లాడు. అప్పట్లో ఉన్న పరిస్థితులను దర్శకుడు సుకుమార్ అద్బుతంగా కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. ఇక ప్రస్తుతం శర్వానంద్ ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా కూడా 1980 నేపథ్యంలోనే తెరకెక్కబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిపోయింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం కూడా స్వాతంత్య్రంకు పూర్తి ఉన్న పరిస్థితులను అద్దం పట్టబోతున్నాయి. ఇక ‘జెర్సీ’ చిత్రంలో 1980ల్లో ఒక కుర్రాడు తనలోని క్రికెటర్‌కు గుర్తింపును తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. వయస్సు కాస్త ఎక్కువ అయిన తర్వాత ఆయనకు ఛాన్స్ దక్కుతుంది. ఆ సమయంలో ఇతగాడు ఎలా టీం ఇండియాకు ఆడాడు అనేది సినిమా కథాంశం అంటూ సమాచారం అందుతుంది. అప్పటి పరిస్థితులు, అప్పటి క్రీడా పద్దతులు అన్ని కూడా ఈ సినిమాలో దర్శకుడు గౌతమ్ చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.