Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Hero Ravi Teja Attended His Brother Bharat 11th Day
రవితేజ సోదరుడు భరత్ మరణం తర్వాత మీడియాలో పలు రకాలుగా వార్తలు వచ్చాయి. భరత్ అంత్యక్రియల్లో రవితేజ పాల్గొనక పోవడంతో పాటు, కనీసం చివరి చూపు కూడా చూడక పోవడంను అంతా కూడా తప్పుబట్టారు. పలువురు పలు రకాలుగా విమర్శలు చేశారు. కొందరు కూళీ మనిషిని పెట్టి భరత్ అంత్యక్రియలు చేయించారు అంటూ ఆరోపించారు. ఇలా పలువురు పలు రకాలుగా అంటుండటంతో రవితేజ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చాడు.
నేడు భరత్ ఇంటి వద్దకు వెళ్లిన రవితేజ అక్కడ భరత్‌కు కర్మకాండ నిర్వహించారు. తమ్ముడు భరత్ చిత్ర పటానికి పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఆ సమయంలోనే రవితేజ మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. తమ్ముడు ముహంను అలా చూడలేకే అమ్మా నేను వెళ్లలేదు అని, తన చిన్నాన్నతో అంతిమ సంస్కారాలు చేయించాం అని, మా మనోభావాలు పట్టించుకోకుండా మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా కథనాలు రాస్తున్నారు అంటూ రవితేజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో మా మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వార్తలు రాస్తే బాగుంటుందని మీడియాను కోరాడు.
మరిన్ని వార్తలు: