‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’.. హీరో కొడుకు, హీరోయిన్‌ కూతురు

Hero son and heroine daughter acting as Amar Akbar Anthony

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘టచ్‌ చేసి చూడు’ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చినా కూడా రవితేజ వరుసగా చిత్రాలకు కమిట్‌ అవుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ‘నేలటికెట్‌’ చిత్రాన్ని చేస్తున్న రవితేజ ఇటీవలే శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పాడు. తాజాగా ఆ చిత్రం షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది. శ్రీనువైట్ల కెరీర్‌లో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. శ్రీనువైట్లకు ఈ చిత్రం చావోరేవో అన్నట్లుగా ఉంది. ఈ చిత్రం కూడా ఫ్లాప్‌ అయితే శ్రీనువైట్ల కెరీర్‌ ఖతం అయినట్లే. అందుకే ఈ చిత్రంను చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలని శ్రీనువైట్ల భావిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల స్క్రిప్ట్‌ వర్క్‌ను జరుపుతున్నాడు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఇక ఈ చిత్రంలో రెండు ముఖ్య పాత్రలకు గాను రవితేజ తనయుడు మరియు లయ కూతురును ఎంపిక చేయాలని భావించారు. రవితేజ తనయుడు మహాధన్‌ ఇప్పటికే ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో నిన్నటి తరం హీరోయిన్‌ లయ కూతురు శ్లోకను ఎంపిక చేయడం జరిగింది. మహాధన్‌ మరియు శ్లోకలు ఈ చిత్రంకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇలా వచ్చి అలా వెళ్లి పోకుండా ఎక్కువ సమయం వీరిద్దరు కనిపిస్తారని తెలుస్తోంది. రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.