Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినీ హీరో హీరోయిన్లు ఎక్కువగా … తమ సినిమాలకు సంబంధించిన విషయాలనో, వ్యక్తిగత సంగతులనో ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంటారు. కొందరు సినీ ప్రముఖులు మాత్రం తరచుగా సామాజిక విషయాలపై స్పందిస్తూ ఉంటారు. ఆ కోవలో ముందుంటారు తమిళ హీరో సూర్య. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే..మరో పక్క సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు సూర్య. ఆగరం ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సూర్యకు సామాజిక స్పృహ కాస్త ఎక్కువే. విజయదశమి సందర్భంగా ఆయన చేసిన ఓ ట్వీట్ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. దుర్గామాత విశేషపూజలందుకునే దసరాను పురస్కరించుకుని మహిళల సమస్యల గురించి ట్విట్టర్ లో ప్రస్తావించారు సూర్య. ఏ దుర్గా గర్భస్రావానికి గురికాకూడదని… ఏ సరస్వతీ పాఠశాలకు వెళ్లకుండా ఆగిపోకూడదని, ఏ లక్ష్మీ డబ్బుకోసం తన భర్తను ప్రాధేయపడకూడదని, ఏ పార్వతీ కట్నానికి బలికాకూడదనీ, ఏ సీతా తనలో తాను కుమిలిపోకూడదని, ఏ కాళీదేవికీ ఫెయిర్నెస్ క్రీమ్ ఇవ్వకూడదనీ… నవమి సందర్భంగా ప్రార్ధించండి అని సూర్య ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చదివిన ప్రతి ఒక్కరి మనసును కదిలించేలా ఉన్న ఈ పోస్టుపై సూర్య అభిమానులు భావోద్వేగంతో స్పందించారు. సూర్య పోస్ట్ అందరినీ ఆలోచింపచేసేలా ఉందని అభిమానులు ప్రశంసించారు. మంచి సందేశం ఇచ్చారని, మహిళల్ని గౌరవించే సూర్యకు అభిమానులం కావడం గర్వంగా ఉందని కొందరు ట్వీట్ చేశా