సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పార్టీ ప్రకటించకుండానే ఆయనకు తమిళ ప్రజలు లక్షల్లో మద్దతు తెలుపుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019లో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా రజినీకాంత్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించబోతుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు ఒక అంచనాకు వచ్చేశారు. దాంతో రజినీకాంత్ పార్టీలో చేరేందుకు రాజకీయ నాయకులు మరియు సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రజినీకాంత్ అంటే అభిమానం ఉన్నవారు సినిమా పరిశ్రమలో లెక్కలేనంత మంది ఉన్నారు. వారంతా కూడా రజినీ వెంట నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు.
రాజకీయాలంటే ఎక్కువ ఆసక్తి చూపుతున్న యువ హీరో విశాల్ కూడా రజినీకాంత్ పార్టీలో జాయిన్ అవ్వడం ఖాయం అని తేలిపోయింది. ఇప్పటికే విశాల్ బహిరంగంగానే తాను తలైవాకు మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించాడు. తప్పకుండా రజినీకాంత్ రాజకీయాల్లో రాణిస్తాడు అంటూ విశాల్ నమ్మకం వ్యక్తం చేశాడు. ఇక రజినీ ఆదేశిస్తే తాను తమిళనాడులోని ఏ అసెంబ్లీ స్థానం నుండి అయినా పోటీ చేసేందుకు సిద్దం అంటూ సన్నిహితుల వద్ద చెబుతూ వస్తున్నాడు. రజినీకాంత్‌కు విశాల్‌కు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో, రజినీకాంత్‌కు విశాల్ నమ్మకస్తుడు అయిన కారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో విశాల్‌కు సీటు ఇచ్చే అవకాశం ఉందని తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.