సెక్స్‌ లేకపోవడంతో మా సినిమా ఫ్లాప్‌

heroine Raai Laxmi On About Julie 2 Movie Failure

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సౌత్‌ బ్యూటీ లక్ష్మీరాయ్‌ ఇటీవ బాలీవుడ్‌లో నటించిన చిత్రం ‘జూలీ 2’. ఈ చిత్రం నిన్నటి తరం స్టార్‌ హీరోయిన్‌ జీవిత చరిత్రతో తెరకెక్కించడం జరిగింది అంటూ విడుదల సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఇక సినిమా విడుదల ముందు ఇదో బూతు సినిమా అన్నట్లుగా, ఇందులో అడల్ట్‌ కంటెంట్‌ బోలెడు ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రేక్షకులను నమ్మించేలా ప్రమోషన్‌ చేశారు. విడుదల చేసిన టీజర్‌, పోస్టర్స్‌, ట్రైలర్‌ ఇలా అన్ని కూడా ఇదో అడల్ట్‌ కంటెంట్‌ చిత్రం అన్నట్లుగా అనిపించాయి. కాని తీరా సినిమా చూస్తే ఒక సాదా సీదా రెగ్యులర్‌ సినిమాలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇతర సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో రొమాన్స్‌, అడల్ట్‌ కంటెంట్‌ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.

heroine-Laxmi-Raai

ప్రేక్షకులు ఒకటి ఆశించి సినిమాకు వెళ్తే అది అందులో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశను వ్యక్తం చేశారు. అదే ‘జూలీ 2’ విషయంలో జరుగుతుంది. ముఖ్యంగా అడల్ట్‌ కంటెంట్‌ ఉంటుందని యూత్‌ ఆడియన్స్‌ సినిమాకు మొదటి రోజు క్యూ కట్టారు. వారు నిరుత్సాహంను వ్యక్తం చేశారు. సినిమాకు రివ్యూ కూడా పాజిటివ్‌గా రాలేదు. దాంతో సినిమా రెండవ షో నుండి డిజాస్టర్‌ టాక్‌ను దక్కించుకుంది. ఇదే విషయమై రాయ్‌ లక్ష్మి స్పందిస్తూ.. తమ సినిమాలో సెక్స్‌ ఎక్కువ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులను నిరాశ పర్చడం జరిగింది.

lead-actress-Raai-Laxmi

ప్రమోషన్‌లో తమది సెక్స్‌ సినిమా అంటూ చెప్పడంతో ప్రేక్షకులు దాన్ని ఆశించారు. కాని సినిమాలో సెక్స్‌ లేకపోవడంతో వారు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ సినిమా డిజాస్టర్‌ అయ్యిందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రమోషన్‌ విషయంలో తప్పు చేసినట్లుగా ఆమె చెప్పడం జరిగింది. హిందీలో రాయ్‌ లక్ష్మి ఈ చిత్రంతో మంచి క్రేజీ హీరోయిన్‌గా మారిపోతుందని అంతా భావించారు. కాని ఆమెకు తీవ్రంగా నిరాశే ఎదురయ్యింది. అసలు హిందీలో మళ్లీ ఈమెకు అవకాశాలు వస్తాయా రావా అనేది కూడా తెలియదు. సౌత్‌లో ఈమెకు ఐటెం సాంగ్స్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాని హిందీపై ఎక్కువ దృష్టి పెట్టిన ఈ అమ్మడు వాటిని కాదంటుంది.

Laxmi-Raai