నేనేం బజార్లో వస్తువును కాదు: టాప్‌ హీరోయిన్‌…!

Heroine Shreya Serious On Anchor

అగ్ర హీరోల సరసన నటించి ఓ వెలుగు వెలిగిన శ్రియ ఇప్పటికి అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. మూడు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకు శ్రియా సొగస్సే కారణం. ఈ అమ్మడి సొగస్సు ఇప్పిటికి అందరిని కట్టి పడేస్తోంది అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. శ్రియ నటించిన ‘వీరభోగ వసంత రాయలు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. దాంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను షురూ చేశారు. అందులో భాగంగా శ్రియా తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోంది. ఇటీవలె ఓ రష్యన్‌ వ్యాపారవేత్తతో శ్రియ వివాహం జరిగింది. దాంతో శ్రియ వైవాహిక జీవితం గురించి చెప్పమని యాంకర్‌ అడిగింది.

veeraboga-vasantha-raya

మీరు సినిమాల గురించి ఏ విషయాన్ని అయినా అడగండి, అన్నిటికి సమాధానం చెప్తాను, కానీ నా వ్యక్తిగత విషయాలను గురించి ఏ ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు, అలా చెప్పడానికి నేనేం బజార్లో వస్తువును కాదు, నా వ్యక్తిగత జీవితాన్ని అమ్ముకోను, ఈ విషయాలు అడిగి టైం వేస్ట్‌ చేయకండి అంటూ ఈ టాప్‌ హీరోయిన్‌ యాంకర్‌పై సీరియస్‌ అయ్యింది. సెలబ్రిటీల పర్సనల్‌ విషయాలు తొసుకోవాలని ప్రేక్షకుకు చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకే ఇలాంటి సందర్భంలో వాటిని బయట పెట్టాలని యాంకర్‌ అడిగింది. దానికే ఈ అమ్మడు చాలా సీరియస్‌ అవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

shreya-heroin