తెలంగాణా పవన్ కళ్యాణ్…కోదండరాం…!

TJS Chief Prof Kodandaram Comments On Mahakutami Defeat In Telangana Elections

టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహా కూటమిలో అసలు క్లారిటీ ఉందా ? ముఖ్యంగా కూటమిలో ప్రధానంగా వినపడుతున్న టీజేఎస్ అధినేత కోదండరాం ఏమి మాట్లాడున్నారో ఆయనకయినా క్లారిటీ ఉందొ లేదో ? అన్న అనుమానం ప్రజల్ల్లో మొదలవుతోంది. టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా రాజకీయంగా బద్ధ శతృత్వం వున్న కాంగ్రెస్, టీడీపీలు ఒకే గొడుగుకిందకు వచ్చాయి. ఈ రెండు పార్టీల పొత్తు మీద పలు పార్టీలతో పాటు రాజకీయ విమర్శకులు కూడా విస్తుపోయారు. రాను రాను దానికి కారణాలను అవగతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల విషయంలో కూటమి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

kodhandaram
అయితే వారి సంగతి కాస్త పక్క పెడితే కూటమిలో భాగంగా వున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సీట్ల పంపకాల విషయంలో తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఈ కేటాయింపుల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ తో పలుమార్లు భేటీ అయిన సందర్భాలు వున్నాయి. అయినా ఇప్పటికీ పంపకాల విషయం తేలనేలేదు. దీంతో ఒకింత అసంతృప్తితో వున్న కోదండరాం టీఆర్ఎస్ ఓటమి ఎజెండాతో ఒకటయిన కారణంగా ఆరంభంలోనే కూటమి నుండి విడిపోతే టీఆర్ఎస్ పార్టీకి చులకన అవుతామనే కారణంతో వేచి చూస్తున్నారు.

Telangana Grand Alliance Tjs Demands 16 Assembly Seats

దీంతో మరోసారి కాంగ్రెస్ తో భేటీ అయినా దీనిపై ఎటువంటి క్లారిటీ రాక మల్లగుల్లాలు పడుతున్న కోదండరాం అంతర్మథనంలో పడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రేపు అంటే 23న వరంగల్ లో పోరు గర్జన నిర్వహించాలను కున్న జనసమితి సభ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకపక్క టీఆర్ఎస్ ప్రచారంలోను మేనిఫెస్టోప్రకటనలోను, అభ్యర్థుల ప్రకటనలోను దూసుకుపోతుంటే కోదండరాం కనీసం సభలు నిర్వహించకపోయినా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా వీలులేని సంకటపరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లుగా తెలుస్తోంది.అందుకే ఆయన రోజుకొక మాట మాట్లాడుతూ తెలంగాణా పవన్ కళ్యాణ్ అని పేరు తెచ్చుకుంటున్నారు అని పలువురు సోషల్ మీడియా లో కామెంట్లు చేస్తున్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన మహాకూటమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, ఈ విషయంలో ఆ పార్టీ పట్టుదలను ప్రదర్శిస్తే తాము చేయగలిగింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. పొత్తులు ఇంతవరకూ తేల్చకపోవడాన్ని తప్పుబట్టిన ఆయన, మిగతా పార్టీలు సైతం కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నాయని అన్నారు.

tjs-kodhandaram

తాము ఎంతగా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ స్పష్టతను ఇవ్వడం లేదని ఆరోపించారు.ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, తమలో సహనం నశిస్తోందని, నేడు కాంగ్రెస్ స్పందించకుంటే, ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించుకోవడం మినహా తమ ముందు మరో మార్గం లేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో తాము చేయగలిగింది కూడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. మహాకూటమి విచ్ఛినమైతే, తమతో కలసి నడిచేందుకు సీపీఐ సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. పొత్తు కుదరకుంటే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోదండరామ్ వ్యాఖ్యానించారు.ఇక ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికీ ఉత్తమ, ఎల్ రమణ, చాడలతో ప్రెస్ మీట్ పెట్టిన కోదండ రాష్ట్రంలో కేసీఆర్‌ నిరంకుశ పాలన మళ్లీ రాకుండా చూడాలని ప్రజాస్వామికవాదులంతా బలంగా కోరుకుంటున్నారని, పొత్తుల విషయంలో అంతా కలిసి ముందుకెళ్లాలని ప్రజల నుంచి తమపై ఒత్తిడి వస్తోందని కోదండరాం చెప్పారు. సీట్ల విషయంలో చిన్నపాటి విభేదాలు వచ్చినా.. పొత్తుతోనే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఇది ఉదాహరణకు మాత్రమె ఇలాంటి వ్యాఖ్యలే టీజేఎస్ కోదండ రాం పార్టీ శ్రేణుల గుండెల్లో రైళ్ళు పరిగేట్ట్టిస్తున్నాడు. కేసీఆర్ లాంటి మనిషి చేతనే ఈ కోదండరాం దిమాగున్నోడు అనిపించుకున్న ఆయన ఇప్పుడు ఇలా పవన్ లా పొద్దునొక మాట సాయంత్రం ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయం అంతు పట్టనిదిగా తయారయ్యింది.