హీరోయిన్ తాప్సీ పెళ్లి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా?

heroine-taapsees-wedding-secretly-married
heroine-taapsees-wedding-secretly-married

సొట్టబుగ్గల బ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్లో ఝుమ్మంది నాదం మూవీ తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అడపాదడపా ,మూవీ లు చేసి ఆ తర్వాత మకాం బాలీవుడ్కు మార్చింది. ఇక అక్కడ వరుస మూవీ లు చేస్తూ దూసుకెళ్తోంది. బీ టౌన్లో తాప్సీ రూటే సపరేటు. ఈ భామ వర్సటైల్ మూవీ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం తాప్సీ మూవీ లే కాదు ఆమె మాటలు చేతలు కూడా ఇతర హీరోయిన్ల కంటే చాలా భిన్నం.

ఇక తన పర్సనల్ లైఫ్ను అంతగా ఎక్స్పోజ్ చేయని తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల చాలా మంది హీరోయిన్లు తమ బ్యాచిలర్ లైఫ్నకు గుడ్ బై చెబుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే రకుల్ తన బాయ్ ఫ్రెండ్ జాకీని వివాహమాడింది.

heroine-taapsees-wedding-secretly-married
heroine-taapsees-wedding-secretly-married

ఇక తాప్సీ కూడా తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మథియస్ బోను సీక్రెట్గా పెళ్లాడిందట. గత పదేళ్ల నుంచి ఈ జంట రిలేషన్షిప్లో ఉన్నారు . ఈ విషయాన్ని తాప్సీ అధికారికంగా ప్రకటించకపోయినా ఇది అందరికీ తెలిసిన రహస్యమే. ఉదయ్‌పూర్ లో తాప్సి పెళ్లి 23వ తేదీన జరిగిందట. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరగిందని అంటున్నారు.