భాగ్యనగరంలో హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్‌లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోని చార్మినార్ వద్ద లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నల్ల రిబ్బన్లు ధరించి ప్రార్థనలకు హాజరవ్వాలని ముస్లింలకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. మరికాసేపట్లో చార్మినార్ మక్కా మసీద్ వద్ద ముస్లింల ప్రార్థనలు ప్రారంభంకానున్నాయి. ఈక్రమంలో చార్మినార్ వద్ద భద్రతను సౌత్ జోన్ డిసిపి స్నేహ మిశ్రా పర్యవేక్షిస్తున్నారు.


