చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

Big BREAKING: Chandrababu will be released today at 5 pm
Big BREAKING: Chandrababu will be released today at 5 pm

టీడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ తరపు లాయర్ల వాదనలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. క్వాష్ పిటిషన్ కొట్టివేస్తున్నట్టు ఏక వాఖ్యంతో హైకోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది.

నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు న్యాయవాదులు సిద్దార్థ్ లోథ్రా, హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా క్వాష్ పిటిషన్ పై సీఐడీ వాదనలను ఏకీభవించి హైకోర్టు. చంద్రబాబు కస్టడికి సంబంధించిన పిటిషన్ మరో గంట సేపట్లో తీర్పు వెల్లడికానుంది. ఈ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొంది. క్వాష్ పిటిషన్ తీర్పు కోసమే ఏసీబీ కోర్టు ఎదురుచూసింది. తాజాగా ఈ పిటిషన్ తీర్పు ఇలా ఉండటంతో ఏసీబీ కోర్టు ఏం తీర్పు ఇస్తుందనేది వేచి చూడాలి మరీ.