Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలి అంటూ సిట్ అధికారులు పంపిన నోటీసులను సవాలు చేస్తూ హీరోయిన్ ఛార్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. తాను విచారణకు హాజరు కాలేను అని, తాన ఒక అమ్మాయిని, పెళ్లి కావాల్సిన తాను ఇలా విచారణకు హాజరు అవ్వాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేయడం తగదు అంటూ కోర్టులో తన గోడును వెళ్లబోసింది. ఛార్మి తరపు న్యాయవాది ఆమెను విచారణకు హాజరు నుండి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అందుకు హైకోర్టు విముఖత వ్యక్తం చేసింది.
డ్రగ్స్ కేసులో ఖచ్చితంగా ఛార్మి విచారణకు హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆమె కోరినట్లుగా మహిళ అధికారులతోనే ఆమె విచారణ సాగాలని కోర్టు సిట్‌ను ఆదేశించడం జరిగింది. అలాగే ఆమె లాయర్ ముందే ఆమెను విచారించాలని కూడా కోర్టు సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు ఆమె రాతపూర్వకంగా అంగీకరిస్తేనే ఆమె నుండి శాంపిల్స్ తీసుకోవాలని, ఆమె అంగీకారం లేకుండా బలవంతంగా శాంపిల్స్ తీసుకోవద్దని సిట్‌ను హెచ్చరించింది. ఇక అందరిలాగే ఛార్మి విచారణను ఆన్ రికార్డ్ నిర్వహించాల్సిందిగా హైకోర్టు సూచించడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకే ఛార్మిని విచారిస్తామని సిట్ ఉన్నతాధికారులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. దాంతో ఛార్మికి కాస్త ఉపశమనం మరియు కాస్త నిరాశ తప్పలేదు.
మరిన్ని వార్తలు