భారీ అంచనాలతో ఉన్న డార్లింగ్ సినిమా

భారీ అంచనాలతో ఉన్న డార్లింగ్ సినిమా

టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్ మరియు పూజా హెగ్డేలు నటిస్తున్న తాజా చిత్రం “ఓ డియర్”. రాధ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సాహో లాంటి ప్లాప్ తర్వాత కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలను నెలకొల్పుకుంది. కానీ ప్రభాస్ అభిమానులను మాత్రం బ్యాడ్ లక్ అలా తరుముతూనే వస్తుంది.

వారు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పటిలానే వాయిదా పడడంతో వారు ఇప్పుడు చాలా నిరాశలో ఉన్నారు. కానీ ఇప్పుడు వారికి ఊరట కలిగే సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మళ్ళీ ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు ఉండబోతుంది అన్న విషయానికి సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మే నెల రెండో వారంలో విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. అప్పటికి ఎలాగో ఈ లాక్ డౌన్ ల గోల తగ్గుతుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చని చెప్పాలి. మరి డార్లింగ్ అప్పుడైనా వస్తాడో లేదో చూడాలి.