వన్ డే ప్రపంచ కప్ 2023 లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. ఇక మొదటి సెమీఫైనల్ లో ఇండియా మరియు న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. కాగా ఇప్పటి వరకు వన్ డే ఇండియా ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు మొత్తం 7 సార్లు సెమి ఫైనల్ కు అర్హత సాధించింది. కానీ కేవలం మూడు సార్లు మాత్రమే విజయం సాధించి ఫైనల్ కు దూసుకు వెళ్లగా, నాలుగు సార్లు ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలైంది. మొదటిసారి 1983 లో ఇండియా ఇంగ్లాండ్ పై గెలిచింది. అదే విధంగా 1987 లో ఇదే ఇంగ్లాండ్ పై ఓడిపోయింది.
ఆ తరువాత 1996 లో శ్రీలంక చేతిలో ఇండియా ఓడిపోయింది. కానీ మళ్ళీ పుంజుకున్న ఇండియా 2003 లో కెన్యా పై గెలిచింది. ధోని సారథ్యంలో 2011 లో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా 2015లో ఆస్ట్రేలియా మరియు 2019 లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. ఇక ఇప్పుడు మళ్ళీ న్యూజిలాండ్ తోనే సెమి ఫైనల్ ఆడనుంది. మరి గత ప్రపంచ కప్ ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మ్యాచ్ జరిగే వరకు వెయిట్ చేయాల్సిందే.