Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కారణం లేకుండా చింత ఎందుకు ?
కారణం లేకుండా భయం ఎందుకు ?
నిన్ను ఎవరు చంపుతారు ?
ఆత్మ కొత్తగా పుట్టేది కాదు… గిట్టేది కాదు.
జరిగినదంతా మంచికే జరిగింది.
జరిగేదంతా మంచికే జరుగుతోంది.
జరగబోయేదికి కూడా మంచికే జరుగుతుంది.
గతాన్ని తలుచుకుని బాధపడడం వల్ల ప్రయోజనం లేదు.
భవిష్యత్ గురించి ఆందోళన పడనవసరం అంతకన్నా లేదు.
నువ్వు వర్తమానంలో వుంటున్నావన్న స్పృహలో ఉంటే చాలు.
ఇక్కడ నువ్వు కొత్తగా సృష్టించింది ఏమీ లేదు.
అందుకే ఏదో నాశనం అవుతుందన్న భయం ఎందుకు?
పుడుతూ నువ్వు ఏమీ తీసుకురాలేదు .
ఇప్పుడు నీ దగ్గర వున్నదంతా ఇక్కడ నుంచి వచ్చిందే.
నువ్వు ఇచ్చినదంతా ఇక్కడ ఇచ్చిందే.
నువ్వు పొందినదంతా దేవుడు ఇచ్చిందే .
నువ్వు సమర్పించిందంతా ఆయనకే.
వట్టి చేతులతో వచ్చావు. అలాగే వెళ్ళిపోతావు.
నేడు నీది అనుకునేది అంతా నిన్న ఇంకొకరిది. రేపు ఇంకొకరిది.
నువ్వు అది గమనించకుండా నాది అన్న భ్రమలో సంతోషపడుతున్నావు.
ఈ అపసవ్య సంతోషమే అన్ని విచారాలకి హేతువు.
మార్పు అన్నది ప్రకృతి సూత్రం.
నువ్వు జీవితం అనుకున్న చోటే మరణం కూడా వుంది.
ఒక్కసారి నువ్వు లక్షాధికారి కావొచ్చు. ఇంకోసారి కటిక పేదరికంలో ఉండొచ్చు.
నీది నాది, చిన్న పెద్ద అనే విషయాల్ని మనసులో నుంచి తుడిచెయ్.
అప్పుడు ప్రతీది నీదే అవుతుంది. నువ్వు కూడా అందరికీ చెందుతావు.
ఈ దేహం అగ్ని, జలం, వాయువు,భూమి, ఆకాశం అనే పంచభూత నిర్మితం.
ఈ దేహం ఎప్పటికైనా అదే పంచభూతాల్లో లీనం అవుతుంది.
కానీ ఆత్మ శాశ్వతం… ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు ?
అందుకే దైవం మీద చిత్తశుద్ధి వుంచు.
ఆయనే అంతిమంగా ఆధారపడదగినవాడు.
దేవుడు పట్ల విశ్వాసం ఉంటే ఏ భయం, చింత, విచారం కలగవు.
నువ్వు ఏ పని చేస్తున్నా అది దేవుని పట్ల సమర్పణాభావంతో చేయి .
అది జీవితంలో గొప్ప అనుభవాన్ని, శాశ్వత సంతోషాన్ని కలగజేస్తుంది.