Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా బాబా జైలుకి వెళ్ళాక జరిగిన అల్లర్లకు కారణమని పోలీసులు భావిస్తున్న హనీ ప్రీత్ హఠాత్తుగా మీడియాలో ప్రత్యక్షమయ్యారు. ఓ జాతీయ ఛానల్ ప్రతినిధికి కారు లో వెళుతూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇద్దరు మహిళల రేప్ కేసులో ఇరవై ఏళ్ళు శిక్ష పడ్డ గుర్మీత్ ని పూర్తి స్థాయిలో వెనుకేసుకొచ్చిన ఆమె పనిలో పనిగా తమది పవిత్రబంధం అని తేల్చేశారు. ఓ తండ్రి దగ్గర బిడ్డ వున్నా, తాకినా తప్పుగా అనుకుంటారా అని హానీ ప్రీత్ ఎదురు మననే ప్రశ్నించారు. ఇక వారిద్దరి మధ్య అక్రమసంబంధం ఉందని ఆరోపించిన మాజీ భర్త విశ్వాస్ గుప్తా గురించి మాట్లాడేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. ఇంకా మిగిలిన అంశాలపై కూడా వచ్చిన ఆరోపణలకు హానీ ప్రీత్ ఏమి సమాధానాలు ఇచ్చారో మీరే చూడండి..