ఆరోజు రావాలని ఆశ పడుతున్నా: పవన్ కళ్యాణ్..?

Pawan Kalyan
Pawan Kalyan

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మహిళలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు., అక్క తమ్ముళ్లు , అన్నా చెల్లెల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ అని అన్నారు. మన భారతీయులకు శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుకని కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చేది. ఈ పర్వదినం సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన అక్క చెల్లెలు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.

మనం ఆడపడుచులకు అండగా ఉంటామని రక్ష కట్టించుకుంటాం .. అలాంటిది మన కళ్ళ ఎదుట ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యంగా ప్రభుత్వాలు, మన సమాజం మౌనంగా ఉండడం శ్రేయస్కరం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారని అధికారిక గణాంకాలు చెబుతున్న గుండెల్ని పిండేస్తున్నాయి.

ఈ ప్రభుత్వంలోని పెద్దలు అదృశ్యాల గురించి నిమ్మకు నీరెత్తినట్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే మన ఆడబిడ్డల గతి ఏంటి..? వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలు వినే వారు ఎవరు..? ఆడపడుచుల పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించినప్పుడే నిజమైన రక్షాబంధన్. ఆరోజు రావాలని ఆశ పడుతున్నా” అని తెలిపారు.