Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
How Is This Possible pawan kalyan and trivikram next movie
పవన్ కళ్యాణ్ తెలుగులో మాత్రమే పవర్ స్టార్. పక్క రాష్ట్రం తమిళనాడులో పవన్‌కు పెద్దగా గుర్తింపు లేదు. అదే బాలీవుడ్లో పవన్‌కు చెత్త రికార్డు ఉంది. దాంతో పవన్ సినిమాలు ఇతర భాషల్లో విడుదల కావడమే గగనం. అలాంటిది మంచి రేటుకు అమ్ముడు పోవడం అనేది దాదాపు అసాధ్యం. కాని ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ సినిమా మాత్రం భారీగా హిందీ మరియు తమిళనాడులో విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. షాకింగ్ విషయం ఏంటి అంటే హిందీ రైట్స్ దాదాపు 10.5 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా విశ్వసనీయ సమాచారం.
బాబీ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిందీలో భారీ మొత్తానికే అమ్ముడు పోయింది. కాని సినిమా మాత్రం కనీసం పబ్లిసిటీ ఖర్చును కూడా రాబట్టలేక పోయింది. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా ఎందుకు బాలీవుడ్లో అంత రేటుకు అమ్ముడు పోయింది అనే విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పవన్, త్రివిక్రమ్ సినిమా అంటే తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్. కాని హిందీ ప్రేక్షకులకు వీరి కాంబో మూవీపై పెద్దగా అంచనాలు లేవు. అయినా కూడా హిందీకి చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్ర కథ మరియు వీరిద్దరి కాంబోపై ఉన్న నమ్మకంతో భారీ రేటు పెట్టి కొనుగోలు చేయడం జరిగిందట. తమిళంలో కూడా పవన్ గత చిత్రాలు ఏవి కూడా అమ్ముడు పోని రేటుకు అమ్ముడు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు