బాలీవుడ్లో ప్రేమలో పడటం, బ్రేకప్‌లు అవ్వడం చాలా కామన్‌గా జరిగే వ్యవహారం. అయితే పెళ్లిల్లు బ్రేకప్ అయ్యి, మళ్లీ కలవడం అనేది అరుదుగా చూస్తూ ఉంటాం. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 15 సంవత్సరాల క్రితం సుసానేను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి జంటకు మంచి పేరు ఉండేది. ఎక్కడకు వెళ్లినా కూడా వీరిద్దరు చెట్టా పట్టాలేసుకుని సంతోషంగా వెళ్లే వారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అంతా హాయిగా సాగుతున్న సమయంలో వీరిద్దరి సంసార జీవితంలో కల్లోలం మొదలు అయ్యింది. ఆ కల్లోలం కాస్త విడాకులకు దారి తీసింది. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా కలిసి ఉండి సంతోషంగా ఉండలేమని నిర్ణయించుకున్న వీరు, విడిపోయి స్నేహితులుగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కొడుకుల కోసం కలిసి మెలిసి ఉంటున్న వీరు మళ్లీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
గతంలో ఉన్న మనస్పర్థలను పక్కకు పెట్టి ఇప్పుడు మళ్లీ ఒక్కటి అవ్వాలనేది వీరి అభిమతం అన్నట్లుగా తెలుస్తోంది. కొడుకులు వీరిద్దరిని ఒక్కటి చేయడంలో కీలక పాత్ర పోషించినట్లుగా సమాచారం అందుతుంది. ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరు మళ్లీ ఒక్కటి అయ్యేందుకు సిద్దం అవుతున్నారు. గతంలో హృతిక్ రోషన్‌కు హీరోయిన్ కంగనా రనౌత్‌కు మద్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ కారణంగానే వీరిద్దరు విడిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరు కలిసి జీవించేందుకు సిద్దం అవుతున్నారు. కంగనా రనౌత్‌తో గత కొంత కాలంగా హృతిక్ రోషన్ తీవ్రమైన వివాదం పెట్టుకుంటున్నాడు. ఇద్దరి మద్య పెద్ద అగాదం ఏర్పడటం జరిగింది. ఇదే సమయంలో భార్య సుసానేతో హృతిక్ దగ్గర అవుతున్నాడు. వీరి కలయిక బాలీవుడ్ ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగిస్తుంది.