గోపీచంద్‌కు కూడా ఓకే చెప్పేసింది

Gopichand Next Movie Heroine kajal in Kumar Sai Direction

టాలీవుడ్‌కు చెందిన దాదాపు స్టార్‌ హీరోలందరితో నటించేసిన ముద్దుగుమ్మ కాజల్‌ ప్రస్తుతం చిన్న హీరోలతో వరుసగా చిత్రాల్లో నటిస్తూ ఉంది. రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటించి అలరించిన ముద్దుగుమ్మ కాజల్‌ ఆ తర్వాత కళ్యాణ్‌రామ్‌తో ‘ఎమ్మెల్యే’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం శర్వానంద్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ చిత్రాల్లో కూడా కాజల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. బెల్లంకొండ శ్రీనివాస్‌ చిత్రంలో నటించేందుకు ఏకంగా రెండు కోట్ల పారితోషికంను ఈ అమ్మడు దక్కించుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. చిన్న హీరోలతో నటించేందుకు పెద్ద పారితోషికం అందుకుంటున్న కాజల్‌ తాజాగా మరో చిన్న హీరోకు ఓకే చెప్పేసింది. ఈ అమ్మడు గోపీచంద్‌తో ఒక చిత్రాన్ని చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

గత కొంత కాలంగా సక్సెస్‌ కోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్నా గోపీచంద్‌ తాజాగా కొత్త దర్శకుడు కుమార్‌ సాయి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ నటించేందుకు ఓకే చెప్పింది. భారీ పారితోషికం ఆఫర్‌ చేయడంతో పాటు, మంచి పాత్ర అవ్వడం వల్ల ఈ చిత్రానికి కాజల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కాజల్‌ ఈమద్య కాలంలో వరుసగా చిన్న చిత్రాల్లో నటిస్తు బిజీ అయ్యింది. స్టార్‌ హీరోలతో ఛాన్స్‌లు రాని ఈ సమయంలో చిన్న హీరోలతో మొహమాటం లేకుండా నటిస్తున్న కాజల్‌ను ఇతర హీరోయిన్స్‌ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. స్టార్స్‌తో నటించినంత మాత్రాన చిన్న హీరోలను విష్మరించకూడదు అని, వారితో నటించినంత మాత్రాన స్టార్‌డం తగ్గదు అంటూ కాజల్‌ నిరూపించింది.