సౌత్‌పై జాన్వీ చిన్నచూపు

Jhanvi Kapoor comments on Tollywood Entry

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ‘ధడక్‌’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నటిగా తన తల్లిని గుర్తు చేసిందని, అందంలో కూడా తల్లికి తగ్గ కూతురు అనిపించుకుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ సినిమాకు శ్రీదేవి లేని లోటును జాన్వీ కపూర్‌ తీర్చనుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇలాంటి సమయంలోనే జాన్వీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో కూడా ఈమెతో సినిమాను చేసేందుకు దిల్‌రాజు ఆసక్తిగా ఉన్నాడు అని, రాజమౌళి కూడా తన మల్టీస్టారర్‌ మూవీలో జాన్వీ కపూర్‌ను ఒక హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో జాన్వీ కపూర్‌ సౌత్‌పై అనాసక్తిని చూపించింది.

‘ధడక్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఒక వెబ్‌ మీడియాతో మాట్లాడుతూ జాన్వీ సౌత్‌పై ఆసక్తి లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. తనకు బాలీవుడ్‌లోనే సెటిల్‌ అవ్వాలని ఉంది, తక్కువ మార్కెట్‌ ఉండే సౌత్‌ సినిమాల్లో చేయడం కంటే ఇండియా వ్యాప్తంగా గుర్తింపు దక్కే ఛాన్స్‌ ఉన్న హిందీ చిత్రాల్లో నటించేందుకు తాను ఎక్కువగా ఆసక్తి చూపుతాను అంటూ చెప్పుకొచ్చింది. తన తల్లి కూడా ఒకసారి బాలీవుడ్‌లో ఛాన్స్‌ వచ్చాక మళ్లీ తెలుగులో నటించాలని కోరుకోలేదు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా ఆమెకు సౌత్‌ నుండి పెద్ద ఆఫర్లు వచ్చాయి. కాని హిందీ సినిమాలకే ఆసక్తి చూపించింది. అదే దారిలో నేను కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే తన రెండవ చిత్రాన్ని చెబుతాను అంటూ పేర్కొంది. జాన్వీ కపూర్‌ రెండవ సినిమా కూడా హిందీలోనే అని తేలిపోయింది. హిందీలో అవకాశాలు తగ్గినప్పుడు తెలుగులో ఈమె నటిస్తుందేమో చూడాలి.