షాకింగ్ : డేరాలో అస్థిపంజ‌రాలు

Human Skeletons Found Inside Premises of Dera Sacha Sauda

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Human Skeletons Found Inside Premises of Dera Sacha Sauda

ఒక‌ప్పుడు ఆధ్మాత్మిక‌త‌కు, సేవ‌కు నిల‌యంగా భావించిన డేరా గురించి రోజుకో నిజం వెలుగుచూస్తోంది. డేరా మాటున దాగిన చీక‌టి సంగ‌తులు దేశ ప్ర‌జ‌ల్ని నివ్వెర ప‌రుస్తున్నాయి. అసాంఘిక కార్య‌క‌లాపాల అడ్డాగా మారిన డేరా గుట్టు ర‌ట్టు చేస్తున్నారు పోలీసులు.

హ‌ర్యానా, పంజాబ్ ల్లోని డేరా ఆశ్ర‌మాల నుంచి ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు సిర్సాలోని ప్ర‌ధాన ఆశ్ర‌మంలో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ త‌నిఖీల‌కు ముందే ఆశ్ర‌మం గురించి ఓ భ‌యంక‌ర నిజం ప్ర‌చురించింది డేరా అనుకూల ప‌త్రిక స‌చ్ క‌హూ.  సిర్సా ప్రాంగ‌ణంలో అస్థి పంజ‌రాలు ఉన్నాయ‌ని ఆ పత్రిక పేర్కొంది.

డేరా ప‌త్రిక‌లో అలాంటి వార్త‌లు రావ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించేదే అయినా…గుర్మీత్ బాబా గురించి సానుకూలంగా చెప్పేందుకు ఆ అస్థిపంజ‌రాల వార్త ప్ర‌చురించిది స‌చ్ క‌హూ.  ఆశ్ర‌మానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న న‌ది క‌లుషితం కాకుండా ఉండేందుకు అంత్య‌క్రియ‌లు బ‌య‌ట ఎక్క‌డో కాకుండా సిర్సా ప్రాంగ‌ణంలోనే చేయాల‌ని బాబా చెప్పేవార‌ని ఆ ప‌త్రిక తెలిపింది.

అంత్య‌క్రియ‌లు చేసిన త‌రువాత ఆ ప్ర‌దేశంలో మొక్క‌లు నాటేవార‌ని, ఆశ్ర‌మ ప్రాంగ‌ణంలో అస్థిపంజ‌రాలు ఉండ‌టానికి కార‌ణం అదేన‌ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసింది.   అయితే గ‌తంలో ఆశ్ర‌మంలో ప‌నిచేసి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు చెప్పిన సంగ‌తులు మ‌రోలా ఉన్నాయి. బాబాకు బాడీగార్డ్ గా ప‌నిచేసిన బియాంత్ సింగ్ ఆశ్ర‌మంలో హ‌త్య‌ల గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించాడు. ఆశ్ర‌మంలో హ‌త్య‌లు నిత్య‌కృత్య‌మ‌న్న బియాంత్ సింగ్‌.. మృత‌దేహాల‌ను కొన్నిసార్లు ఆ ప్రాంగ‌ణంలోనే పూడ్చివేసేవార‌ని, మ‌రికొన్ని సార్లు ప‌క్కనే ఉన్న న‌దిలో ప‌డ‌వేసేవారిని తెలిపాడు.

రిటైర్డ్ జ‌డ్జి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సిర్సా ఆశ్ర‌మంలో పోలీసులు నిర్వ‌హిస్తున్న త‌నిఖీల్లో మరిన్ని సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. దాదాపు 700 ఎక‌రాల్లో ఉన్న ఈ ప్రాంగ‌ణంలో ఈఫిల్ ట‌వ‌ర్‌, తాజ్ మ‌హ‌ల్‌,  డిస్నీలాండ్ న‌మూనాలు, రిసార్టులు ఉన్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లొచ్చాయి. 

మరిన్ని వార్తలు