Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ వాసులు ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్న మెట్రో రైలు కల మరికొన్ని రోజుల్లో సాకారం కానుంది. హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చే మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభించాలని నిర్ణయించామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పంపారు.
నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో అదే సమయంలో మెట్రో రైలు ప్రారంభించాలని కోరారు కేసీఆర్. ప్రధానికి ఆయన రాసిన లేఖను కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నవంబర్ లో మెట్రో రైలు ప్రారంభోత్సవానికి రావాలనిగతంలో కోరిన విషయం లేఖలో మోడీకి గుర్తుచేశారు కేసీఆర్. ఇప్పుడు మరోసారి ఆహ్వానిస్తున్నానని లేఖలో చెప్పారు.
రూ. 15వేల కోట్ల వ్యయంతో దేశంలోనే అతిపెద్ద పీపీపీగా నిర్మితమైన ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోను అభివర్ణించారు కేసీఆర్. మెట్రోరైల్‌ను మూడు కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. తొలిదశలో మియాపూర్ అమీర్‌పేట మార్గంలో 13 కిలోమీటర్లు, అమీర్ పేట్ నాగోల్ మార్గం 17 కిలోమీటర్లు పూర్తయింది. ఈ 30 కిలోమీటర్ల మొదటి దశను నవంబర్ లో ప్రధాని చే ప్రారంభింపచేయాలని సీఎం భావిస్తున్నారు. తొలిదశకు సంబంధించి ట్రయల్ రన్ కూడా నిరాటంకంగా సాగుతోంది.
మరిన్ని వార్తలు: